
ప్రముఖ శృంగార తార షకీలా అంటే తెలియని సినీ రసికులు ఉండరు. ఒకప్పుడు తన భారీ అందాలతో రసికుల మనసుల్ని గెలుచుకున్న ఈమె కొంత కాలం తరువాత సెక్స్ సినిమాలకు స్వస్తి చెప్పింది. ఈమె పై ఉన్న సెక్స్ ఇమేజ్ ముద్రను పోగొట్టుకునేందుకు చాలా కష్టపడ్డ ఈ అమ్మడు కొంత కాలం ఇలాంటి పాత్రలకు స్వస్తి చెప్పి, క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్రల్లో నటించారు. ఈమె అందాలకు దాసోహం అయిన సినీ జనాలు ఆ పాత్రలలో ఈమెను చూడలేకపోయారు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న షకీలా, మరో సెక్సీ సుందరితో కలిసి తమిళనాడులోని విలుప్పురం జిల్లాలో ఉన్న ‘అంగాల పరమేశ్వరి ’ దేవాలయానికి వచ్చింది. ఈమె వచ్చిన విషయం తెలుసుకున్న అక్కడి జనాలు షకీలాని, ఆమె ప్రక్కనే ఉన్న మరో తారని చూడటానికి ఎగబడ్డారట. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి జనాల్ని అదుపు చేస్తే గానీ అదుపు కాలేదట. అంటే షకీలాకి ఉన్న క్రేజ్ జనాల్లో ఏమాత్రం తగ్గలేదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి వీరందరి కోసమైనా షకీలా రీ ఎంట్రీ ఇచ్చి షేక్ చేస్తుందో లేదో గానీ, అక్కడి పరిసర జనాల్ని షేక్ చేసిందని అంటున్నారు. షకీలా... మజాకా ?