
హీరో మహేష్ బాబుకి టాలీవుడ్ జనాల్లో ఎంత క్రేజ్ ఉందో మనందరికి తెలిసిన విషయమే. ఇక ఈయన పాపులారిటీని క్యాచ్ చేసుకోవడానికి వివిధ కంపెపీల బ్రాండ్లు తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటూ బోలెడంత డబ్బు కుమ్మరిస్తున్నాయి. ఇక డబ్బుల కోసం మహేష్ బాబు ఏ సంస్థకైనా ప్రచారం చేయడానికి సిద్దపడుతున్నాడు. గతంలో షాంపులు, బంగారం షాపులు, థమ్స్ లాంటి వాటిల్లో కనిపించిన మహేష్ తో ఇప్పుడు మహేంద్ర కంపెనీకి కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థకు సంబంధించిన ట్రాక్టర్ల కు ఇక పై ప్రచారం చేయబోతున్నాడు.
ఇటు చేతినిండా సినిమాలు, అటు కమర్షియల్ యాడ్స్ లో బిజీగా ఉంటూ దూసుకుపోతున్న మహేష్ నిత్యం జనాల్లో కనిపిస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు. రైతుల పనులను సులంభంగా చేసుకోవడానికి ఉపయోగించే ఈ ట్రాక్టర్లను మహేష్ ఏ రేంజ్ లో అమ్మడుతాడో చూడాలి.