
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంతా ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా రాత్రి పగలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్స్ కి పోటీనిస్తున్న సమంతా తనది మాత్రం ఖచ్చితంగా ప్రేమ వివాహమే అని చెబుతుంది . నేను ఖచ్చితంగా పెద్దలు కుదిర్చిన పెళ్ళి మాత్రం చేసుకోను. నా మనసుకు నచ్చిన వాడిని మా పెద్దలకు పరిచయం చేసి ఒప్పించి మరీ పెళ్ళి చేసుకుంటానని చెబుతుంది . ప్రేమ వివాహం చేసుకుంటే ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోవచ్చిని, పెళ్ళి తరువాత ఎటువంటి విభేదాలు రావని అంటోంది. నేను ప్రేమిస్తే నిర్భయంగా చెప్పేస్తానని కూడా చెబుతుంది . ఎలాగు ప్రేమ వివాహం చేసుకుంటానని ఫిక్సయిన సమంతా కాబోయే వాడికోసం ఇప్పటి నుండే రెండు చేతులా సంపాదిస్తోంది. ఇటు సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే, ఖాళీ సమయంలో షాపు ఓపెనింగులకు వెళుతూ.... బాగా వెనకేస్తుంది. మరి సమంతను ఎవడు చేసుకుంటాడో కానీ వాటి పంట పండిందని సినీ జనాలు అనుకుంటున్నారు..
