
టాలీవుడ్ లో కళ్యాణ్ హీరోగా వచ్చిన కత్తి సినిమాలో , ఆ తరువాత మంచు మనోజ్ హీరోగా వచ్చిన మిస్టర్ నూకయ్య చిత్రాలలో నటించిన హాట్ భామ సనాఖాన్ గత కొన్నాళ్ళ నుండి వెండితెర పై కనిపించడం లేదు. తాజాగా ఈమె బిగ్ బాస్ - 6షోలో ఛాన్స్ కొట్టేసి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సనా ఖాన్ కి ఇదే మంచి అవకాశం అనుకుంటే అంత కంటే ఎక్కువ మంచి అవకాశం కొట్టేసింది. అదేంటంటే... బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సనాఖాన్ బిగ్ బాస్ షోలో చేసిన డాన్స్ కి ఫిధా అయిపోయి, ఆమెకు తన సినిమాలో అవకాశం కల్పిస్తానని హామి ఇచ్చాడట. ఒకవేళ సల్లూభాయ్ సనాఖాన్ కి తన సినిమాలో ఆఫర్ ఇస్తే...ఈమె దశ తిరిగినట్లే అని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.