
సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా అందులో ఐటెం సాంగ్ తప్పకుండా ఉంటుంది. ఐటెం సాంగ్ పెట్టాల్సిన అవసరం లేకున్నా మరీ కల్పించి పెడుతున్నారు. ఇక ఈ ఐటెం సాంగులను చేయడానికి ఐటెం పాపలే కాకుండా స్టార్ హీరోయిన్లు కూడా ఎగబడుతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ కన్నా ఐటెం సాంగులకే బాగా గిరాకి ఉంది. ఈ గిరాకిని ఖాళీగా ఉన్న హీరోయిన్స్ క్యాచ్ చేసుకుంటున్నారు. ఒప్పుడు ఒక సినిమాలో ఐటెం సాంగు చేయాలంటే.... కనీసం 20 నుండి 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
కానీ మన ఛార్మింగ్ గాళ్ ఛార్మి మాత్రం ఈ మధ్యన నాగార్జున నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగుకు ఛార్మి అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుందని అంటున్నారు టాలీవుడ్ జనాలు.ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ఛార్మి ఆ సాంగులో నటించడానికి కేవలం 12 లక్షలు మాత్రమే తీసుకుందట. ఎందుకంటే అసలే అవకాశాలు లేవు... రాకరాక ఐటెం సాంగు అవకాశం వచ్చింది కాబట్టి ఒకవేళ ఎక్కువ డిమాండ్ చేస్తే ఉన్న అవకాశం ఎక్కడ జారిపోతుందోనని అంత తక్కువ రేటుకే ఒప్పుకుందని అంటున్నారు. మరి ఈ ఐటెం సాంగుతో నైనా ఛార్మికి ఇండస్ట్రీలో అవకాశాలు పెరుతాయో లేదో చూడాలి.