
జర్నీ, షాపింగ్ మాల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనస్సులు దోచుకున్న అంజలి మీకు గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మల్టీ స్టారర్ చిత్రం అయిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ సినిమాలో వెంకటేష్ భార్యగా నటిస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటి... ఇవన్నీ మాకు తెలిసినవే కదా అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్నాను... ఈ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న ఈ భామకి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అంజలిని వాళ్ళమ్మ దగ్గరుండి చూసుకుంటంది.
ఇటీవల షూటింగ్ లేనప్పుడు ల్యాప్‌టాప్‌తోనే అంజలి గడపటంతో ఆమె లేనప్పుడు ఇ-మెయిల్స్ చెక్‌చేసి ఖంగు తిందట. అందులో కూతురు ప్రేమ వ్యవహారం చాటింగ్ చూసి నివ్వెరపోయిందట. పూర్తిగా ప్రేమలో మునిగిపోయిన అంజలి నిద్రలో కూడా ఉలిక్కి పడటం, కలవరించడం కూడా చూసిందట వాళ్లమ్మ. ఈ మేటర్ అంజలి పసిగట్టిన అంజలి అమ్మ ఏమైనా అంటుందేమోనని టెన్షన్ గా కనబడుతుందట. కానీ ఆమె తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తూ.. కూతుర్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తుందట. అంజలీ లవ్ మేటర్ తెలుసుకున్న సినీ జనాలు అంజలి మనస్సు దోచిన అతగాడు ఎవరా అని ఆరా తీయడం మొదలు పెట్టారట. ఇదీ సంగతి.
