24 May Friday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
E - Articles
  • Pawan is beautiful than Rambha.png

    Oct 06 ,2012 07:20 pm

    Pawan_Rambha

    ప్రముఖ వివాదాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ మొన్న గాంధీజీని కామెంట్ చేస్తూ... చేసిన వ్యాఖ్యల్ని జనాలు మరవక ముందే.. ప్రముఖ టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ని ఓ హీరోయిన్ తో పోల్చుతూ కామెంట్ చేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ఈ నెల 18వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్లను మొన్న విడుదల చేశారు. వర్మ శిష్యుడైన పూరీ తన గురువుకి ఈ సినిమా ట్రైలర్లు పంపించాడట. ఈ ట్రైలర్లను చూసిన వర్మ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ... ‘‘ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ... రంభ కన్నా అందంగా ఉన్నాడు ’’. ఇందులో పవన్ కళ్యాణ్ ని చాలా అందంగ చూపించాడు పూరీ...అని పోస్ట్ చేశాడు. ఈ కామెంట్ చూసిన పవన్ కళ్యాణ్ ఒక్క సారిగా షాక్ తిన్నాడు.

    అయితే పవన్ అభిమానులు మాత్రం వర్మకి మతి చెడిందని, ఒక స్టార్ హీరోని ఒక హీరోయిన్ తో పోల్చడం ఏంటని మండిపడుతున్నారు. అయినా వర్మ పిచ్చిగాని ఆయన్ని పోల్చడానికి వేరే పేరే దొరకలేదా ?

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers