
ఒకప్పుడు తన నటనతో ప్రేక్షుల్ని మంత్ర ముగ్దుల్ని చేసిన మనీషా కోయిరాల 1942: ఎ లవ్‌స్టోరి, భారతీయుడు, బొంబాయి, క్రిమినల్ తదితర చిత్రాల ద్వారా ఉత్తర, దక్షిణాది తెరలను ఒక టైమ్‌లో ఒక స్థాయిలో ఏలారామె. రెండేళ్ళ క్రితం ఈ నేపాలీ సామ్రాట్ దహల్‌ని పెళ్లి చేసుకున్నారు. ఏమైందో ఏమోకీ కానీ తన భర్త నుంచి మనీషా విడిపోయారు. ఇక తన పెండ్లి పెటాకులు అయిన తరువాత ప్రస్తుతం తన మనస్సు సినిమాల పై పడింది. ఈ మధ్యనే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘బూత్ రిటర్న్ ’ లో నటించింది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం నాకు సినిమాలు తప్ప తనకు వేరే ప్రపంచం లేదని, పూర్తి టైం సినిమా రంగానికే కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. సినిమా జీవితం తరువాత ఏంటి అని అడిగితే.... భవిష్యత్తులో నేపాల్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని, తన కుటుంబానికి రాజకీయ పరంగా మంచి పేరుందని, వాటిల్లో రాణించి ప్రధానిగా ప్రజలకు సేవచేయాలని ఉందని తన మనస్సులోని మాటను బయట పెట్టింది. ఈ మాటలను బట్టి చూస్తుంటే... మనీషా కోయిరాల ప్రధాని పీఠం పై కన్నేసింది. భవిష్యత్తులో మనీషా కోరిక తీరుతుందో లేదో చూడాలి.
