
అక్కినేని కుటుంబం నుండి తెరంగ్రేటం చేసిన నాగార్జున కొడుకు నాగచైతన్య మూడు నాలుగు సినిమాల్లో నటించినా రావాల్సినంత పేరు మాత్రం రాలేదు. నాగార్జున కొడుకుగా కాకుండా మామూలు హీరోగా ఎంట్రీ ఇస్తే ఎప్పుడో ఇండస్ట్రీ జనాలు ఇతన్ని పక్కన బెట్టేవారు. వారసత్వ బలంతో నెగ్గుకొస్తున్న ఈ యువ హీరోకి ఇంత వరకు సినిమాల పై ఏ ఖచ్చితమైన అవగాహన రానట్లు ఉంది. దర్శకులు చెప్పిన స్టోరీలు విని కమీట్ అయి, షూటింగ్ ప్రారంభించే సమయానికి ఆ సినిమాల నుండి తప్పుకుంటున్నాడట. ప్రస్తుతం అల్లు శిరీష్ ఎంట్రీ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘గౌరవం ’ సినిమా ఒప్పుకొని తరువాత అందులో నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి అసోషియేట్ అయిన కోటి అనే దర్శకుడు నాగచైతన్యకు ఓ కథను వినిపించాడట. ఈ కథ వినడానికి అతన్ని అన్నపూర్ణ స్టూడియోకి కాళ్లరిగేలా తప్పించాడట. ఈ స్టోరీ విన్న తరువాత కూడ అతనికి కూడా హ్యాండ్ ఇచ్చాడట. ఇప్పడు అదేని ‘రవితేజ’కు వినిపించాడట. ఈ సినిమా స్టోరియే ‘జింతాత.’.ఇలా నాగచైతన్య కావాలని ఆపర్లు జారవిడుచుకుంటున్నాడు. ఈ చిత్రాలు గనుక హిట్ అయితే చైతన్య చాలా బాధ పడాల్సి వస్తుందంటున్నారు సినీ జనాలు.