
సౌత్ ఇండియా సూపర్ రజినీ కాంత్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారని ఫిలింనగర్ లో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. యూ టీవీ సంస్థ రజినీ కాంత్ తో 240 కోట్ల రూపాలయలతో ఓ భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేసిందని, ఇందులో రామ్ చరణ్ రోల్ కూడా ఉంటుందని అంటున్నారు. సాక్స్ పిక్చర్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మించనున్నారట.
అయితే ఈ విషయమై రజినీకాంత్ ని సంప్రదిస్తే .... ఒక వేళ ఈ చిత్రం ఫెయిల్ అయితే చాలా కుటుంబాలు రోడ్డు పాలవుతాయని, అందుకే మీరు కూడా మరోసారి ఆలోచించుకోండని రజినీ కాంత్ వారికి సలహా ఇచ్చాడట. దీని పై రజినీకాంత్ స్పష్టమైన నిర్ణయం కూడా చెప్పలేదని సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ ‘కొచ్చాడయాన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.. రామ్ చరణ్ ‘నాయక్' చిత్రంలో నటిస్తున్నాడు.. ఒక వేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే ఓ సంచలనమే అవుతుంది.
