
దర్శక రత్న దాసరి నారాయణ రావు మహేష్ బాబు , క్రిష్ణలను పెట్టి సినిమా తీయబోతున్నాడా ? అంటే ఫిలింనగర్ లో వర్గాలు అవుననే అంటున్నాయి. మహేష్‌బాబు, దాసరి నారాయణరావు, కృష్ణ కాంబినేషన్‌లో చిత్రం రాబోతుందని, ఈ చిత్రం వివరాలు ఈనెల 10వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. ఒకవేళ దాసరి మహేష్ బాబుతో సినిమా చేస్తే ఎలాంటి సినిమా తీస్తాడోనని ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. గతంలో బాలక్రిష్ణ తో ‘పరమవీర చక్ర ’ తీసి చేతులు కాల్చుకున్న దాసరి, మహేష్ బాబు పై ప్రయోగాలు అవసరమా అని ఆందోళన పడుతున్నారు. మహష్ ని ఏం చేస్తాడో దాసరి.
