
తమన్నా... ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ హీరోయిన్. ఈమె డేట్ల కోసం హీరోలు పడిగాపులు కాసే వరకు వచ్చిందంటే... ఇండస్ట్రీలో ఈమెకు ఉన్న క్రేజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మధ్యన సిల్వర్ స్ర్కీన్ పై తన నడుము, బొడ్డు అందాలతో ప్రేక్షకుల మదినే కాకుండా, హీరోల, దర్శక నిర్మాతల మతి పోగొడుతున్న తమన్నా ‘రచ్చ ’ సినిమాతో రామ్ చరణ్ తో ఏర్పడిన బంధంతో మరోసారి ఆయనతో కలిసి నటించేందుకు రెడీ అయినట్లు సమాచారం. అది హీరోయిన్ గా కాదు... ఐటెం గర్ల్ గా. ప్రస్తుతం రామ్ చరణ్ బాలీవుడ్ లో ‘జంజీర్ ’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ తేవడానికి తమన్నాతో ఓ ఐటెం సాంగ్ ని చేయించడానికి ప్లాన్ చేశారట. ఈ విషయం పై తమన్నాతో సంప్రదింపులు జరుపుతున్నారట.. తమన్నా కూడా దీనికి ఓకె చెప్పవచ్చని అంటున్నారు. ఒకవేళ తమన్నా గనుక ఒప్పుకుంటే... ‘జంజీర్ ’ ఐటెం సాంగ్ జిల్ జిల్ జిగా లాగా మెరిసిపోవడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.