
బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న కరీనా కపూర్ ‘హీరోయిన్ ’ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తుంది. ఈమె త్వరలో బాలీవుడ్ నటుడు అయిన సైఫ్ ఆలీఖాన్ ని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈమెను హీరోయిన్ గా పెట్టి ప్రముఖ దర్శకుడు అయిన సంజయ్ లీలా బన్సాలీ ఓ చిత్రం తీయడానికి ప్లాన్ చేశాడు. ఈ విషయం పై చర్చలు జరపడానికి వెళ్లిన అతను కరీనా కపూర్ అతను ఓ విచిత్రమైన షతరు విధించాడు. ఆ షరతు ఏంటంటే.... త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నావ్ కాబట్టి నా సినిమా ‘ రామ్ లీలా ’ షూటింగ్ పూర్తయ్యే సరికి నీవు గర్భం దాల్చవద్దని చెప్పాడట. దీంతో ఖంగుతిన్న కరీనా నిర్మొహమాటంగా ఆ సినిమాలో చెయ్యనని చెప్పేసిందట. దీంతో చేసేదేమీ లేక సదరు దర్శకుడు వేరే అమ్మాయి వేటలో పడ్డాడు. చివరికి ఈ చిత్రంలో దీపికా పదుకునే ఖరారైనట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ జనాలు మాత్రం కరీనా ఈ ఆఫర్ వదులుకోవడాన్ని బట్టి చూస్తుంటే... పెళ్లయిన వెంటనే గర్భం దాల్చి ఓ పండంటి పాపాయికి జన్మనిచ్చి, అమ్మతనంలో మాధుర్యాన్ని అనుభవించాలనే ఉద్ధేశ్యంతో ఆఫర్ ని వదులుకుందని అనుకుంటున్నారు. కరీనా ఆత్రుత చూస్తుంటే... వివాహం అనే ఆచారం లేకుంటే... సైఫ్ తో పరిచయం అయిన కొన్ని రోజులకే తల్లయ్యేదని అనుకుంటున్నారు.
