
ఎట్టకేలకు కోస్తాంధ్ర వాసుల కల నెరవేరింది. సింగపూర్ విమానం విశాఖ నుంచి ఆదివారం రాత్రి 10.55 గంటలకు బయల్దేరింది. ప్రయాణికుల ఆనందం అంబరాన్నంటింది. విశాఖ విమానాశ్రయం పండుగ వాతావరణాన్ని తలపించింది. సింగపూర్ నుంచి ఈ విమానం విశాఖ విమానాశ్రయ రన్‌వేపై ఆదివారం సాయంత్రం 5.10 గంటలకు వాలింది. ఈ విమానానికి శుభసంకేతంగా రన్‌వేపై ఐదు నిమిషాలపాటు పైరింజన్లతో నీళ్లు జల్లి స్వాగతం పలికారు. సింగపూర్‌నుంచే కాక అమెరికా, ఆస్రేృలియా తదితర దేశాల నుంచి ప్రవాసాంధ్రులు కేరింతలు కొడుతూ దిగారు. వారికి సిల్క్ ఎయిర్ వేస్ విమాన సంస్ధ సీఈవో లెస్లీథంగ్,సింగపూర్ అంబసీ కౌన్సిల్ జనరల్ అజయ్‌సింగ్, మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సునీల్‌శర్మ, తదితరులు స్వాగం పలికారు. పలు సంస్థల ప్రతినిధులు పూలమాలలతో ముంచెత్తారు.
...avnk
