సింగపూర్ తరహాలో స్టాండర్డ్ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం
అంతర్జాతీయప్రమాణాలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు విశాఖ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్‌ను సిద్దం చేస్తోంది.సింగపూర్ సిటీని మోడల్‌గా చేసుకుని అభివృద్ది చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.సింగపూర్‌లో జూన్ 24 వతేదీ నుంచి జులై 1వ తేదీ వరకు వరల్డ్ సిటీ-2012 పేరుతో సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్‌లో జివిఎంసి కమిషనర్ రామాంజనేయులు,ఛీఫ్ సిటీప్లానర్ వెంకటరత్నం,ఛీఫ్ ఇంజనీర్ జైరాంరెడ్డి పాల్గొన్నారు.తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్‌లో 105 దేశాల నుంచి 135 నగరాలకు చెందిన ప్రతినిధులు హాజరైనట్లు జివిఎంసి కమిషనర్ రామాంజనేయులు తెలిపారు.సింగపూర్ తరహాలో ఓ స్టాండర్డ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ప్రజాప్రతినిధులు,అధికారులు,మేధావులతో పాటు మీడియాను కూడా ఈ కమిటీలో భాగస్వాములను చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.సింగపూర్ తరహాలో అభివృద్దిచేయటానికి అన్ని వనరులున్న సిటీగా విశాఖకు సింగపూర్ సమ్మిట్‌లో గుర్తింపు లభించిందని రామాంజనేయులు తెలిపారు.