ఉక్కు కార్మికులకిది కాళ రాత్రి.. చుట్టూ చిమ్మ చీకటి.. కార్మికుల ఆర్తనాదాలు.. శరీరమంతాకాలినగాయాలు.. దిక్కుతోచని స్థితిలో రక్షించండి అంటూ అరుపులు .. రాష్ట్ర పారిశ్రామిక రాజధాని విశాఖలోని స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్-2లోని ఆక్సిజన్ ప్లాంట్‌లో విస్ఫోటం సంభవించడంతో సుమారు 14 మంది మృత్యువాత పడగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ ఎస్‌ఎంఎస్ విభాగం-2లోని ఆక్సిజన్ హోస్‌లో అనూహ్యంగా జరిగిన ఘోర ప్రమాదంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో విధినిర్వహణలో ఉన్న పదుల సంఖ్యలో కార్మికులు అసువులు బాశారు. ఈ దుర్ఘటనలో మరెందరో కార్మికులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. శ్రామికలోకం తల్లడిల్లిపోయింది.. స్టీల్ మెటల్ షాపులో జరిగిన ఈ దారుణం 1997లో హెచ్‌పీసీఎల్ విస్ఫోటనాన్ని తలపించింది.
