విశాఖలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా స్వైన్ ప్లూ సోకినట్లు సమాచారం. ఆయన గత రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.కాగా ఇప్పటికే ఈ వ్యాధితో ఓ గర్భిణి మృతి చెందగా మరో గర్భిణి స్వైన్ ప్లూ బారిన పడింది. ఆమెకు కింగ్ జార్జ్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో మరో యువకుడు కూడా స్వైన్ ప్లూ లక్షణాలతో బాధపడుతున్నాడు. అతను ఛాతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
