
మానవత్వం పరిమళించిన ఘటన ఒకటి క్రుష్ణాజిల్లాల్లో వెలుగుచూసింది. పురాణాల్లో ఉన్నట్టు రావణాసురుని చెరలో బందీగా ఉన్న సీతమ్మవారిని విడిపించేందుకు బయలుదేరిన శ్రీరాములవారి సైన్యం సముద్రాన్ని దాటేందుకు రామసేతువును నిర్మిస్తుండగా, తన వంతు సాయంగా ఇసుకపోసిన ఉడతంటే భారతీయులకు మమకారమే. శ్రీరాముని అమృతహస్తాల స్పర్శ భాగ్యంపొందిన ఉడతలు ఇళ్ళు, వాకిళ్ళలో తిరుగాడుతూ సందడి చేస్తుంటే చూసి పిల్లలు మురిసిపోతుంటారు.
అలాంటి ఓ పెంపుడు ఉడత కళ్ళముందే చనిపోవటంతో తల్లడిల్లిన ఓ కుటుంబం సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేసిన వైనమిది. క్రుష్ణాజిల్లా చల్లపల్లి పాగోలు శివాలయం వెనుక నివసిస్తున్న అయ్యంకి రామకృష్ణ ఇంటి పరిసరాల్లో తిరుగాడే ఒక ఉడత శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందింది. కాంట్రాక్టర్ హరిబాబు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, ప్రమాదవశాత్తూ బండి టైరు కింద పడి ఉడత మృతిచెందింది. రాంబంటుగా పిలుచుకునే తమ ఇంటి ఉడుత కళ్ళముందే చనిపోవటంతో రామకృష్ణ కుటుంబసభ్యులు, స్థానికులతో కలిసి దాని మృతదేహానికి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఖననం చేశారు.
మూగజీవులు, చిరు ప్రాణులను రక్షించటమే కాకుండా అవి సురక్షితంగా పెరిగేందుకు అవరసరమైన వాతావరణం కలిగిన పల్లెటూళ్ళలో వాటి సంఖ్య పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
...avnk