బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఇవాళ (మంగళవారం) మహర్నవమి సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ మహిషాసురమర్దని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజునే మహాలక్ష్మీ రూపినీ అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించినట్లు చండీసప్తశతి గ్రంథం తెలుపుతోంది. ఆ నాటి నుంచి ఈ నవమి 'మహర్నవమి'గా పేరొందింది. ఒక చేత్తో త్రిశూలాన్ని పట్టుకుని మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంలో జగన్మాత మహిషాసురుని మర్దినిగా ఈ రోజు భక్తులకు దర్శనమిస్తోంది.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా బుధవారం విజయదశమి సందర్భంగా అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైలం భమరాంభికాదేవి మంగళవారం మహాదుర్గ అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు పార్వతీపరమేశ్వరులు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా రాష్ట్ర ప్రబుత్వం తరఫున న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి భ్రమరాంభికా దేవికి పట్టు వస్త్రాలు సమరించారు.
...avnk