దసరా మహోత్సవాలకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైన తీరు చూస్తే పోలీసులు పక్కా ప్లానింగ్‌తో దిగుతున్నారన్న సంకేతాలు కనిపించాయి. తీరా ఉత్సవాల తొలి రోజు పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ట్రాఫిక్ సమస్యల వల్ల భక్తులు పడిన ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. నగ రం నుంచి బయటకు, నగరం లోపలికి వచ్చే వాహనాలను వేర్వేరు మార్గాల నుంచి మళ్లించినా.. ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. గొల్లపూడి బైపాస్ నుంచి పశ్చిమ నియోజకవర్గంలోకి చేరుకునే వాహనాలను మళ్ళించటంలో వైఫల్యం కనిపించింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అడుగడుగునా వాహనాలు నిలిచిపోయా యి. భక్తుల గిరి ప్రదక్షిణకు కూడా ఇబ్బందులు కలిగాయి. కొండ దిగువన ట్రాఫిక్ సమస్య మరీ అధ్వానంగా ఉంది. కాళేశ్వరరావు మార్కెట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఫ్లై ఓవర్ దిగువన వాహనాలు ఆగిపోవటం వల్ల కెనాల్ రోడ్డు నుంచి క్యూలైన్లను చేరుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు చవి చూశారు.