
మూడు రోజులుగా ఎగువన కురిసిన వర్షంతో కృష్ణానదికి భారీగా వరదనీరు వచ్చి చేరింది. కృష్ణమ్మ గల గలలతో బ్యారేజీ నిండుగా కనిపిస్తుంది. ప్రస్తుతం బ్యారేజీలో 12 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఇటీవల వరకు 11 అడుగుల కంటే తక్కువకు నీటి మట్టం పడిపోయి ఆందోళన కలిగిచింది. బుధవారం ఉదయం దిగువకు 59వేల క్యూసెక్కులకు పైగా నీటిని బ్యారేజీ నుంచి దిగువకువదిలారు. రాత్రి సమయానికి 66 గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తి నీటిని వదులుతున్నారు. నాలుగు గేట్లను మూసివేసి దిగువకు 47 వేల 850 క్కూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం నీటిమట్టం నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు. తూర్పు కాల్వకు 1456 క్యూసెక్కులు, పడమటి కాల్వకు 2519, గుంటూరు ఛానల్‌కు 144 క్యూసెక్కులు నీరు వదిలారు.