
సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఆటోమేటిక్ రెయిన్‌గేజ్ (ఏఆర్‌జీ)ని బుధవారం ప్రారంభించారు. ఏఆర్‌జీ నుంచి పూణేలో ఉన్న కేంద్ర కలెక్షన్ సెంటర్‌కు ప్రతి నిమిషం డేటా వెళుతుంది. సుమారు పది కిలోమీటర్ల పరిధిలో పడిన వర్షపాతం వివరాలను సేకరిస్తుంది. అందుకోసం ప్రత్యేక టవర్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 40 ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయాలనుకుం టున్నారు. విజయవాడతో పాటు మరికొన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేయాలనుకున్నారు.కంకిపాడులో స్థలాభావం కారణంగా ఏఆర్‌జీని ఏర్పాటు చేయలేకపోయారు.
అవనిగడ్డ, మచిలీపట్నం, తిరువూరులలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. నాగాయలంకలో ఏర్పాటు చేద్దామని అనుకున్నప్పటికి సాంకేతిక కారణాల వల్ల విరమించుకున్నారు. ప్రస్తుతానికి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఆర్‌జీని ఒక నెల టెస్టింగ్‌లో ఉంచుతారు. దీనిని ఏర్పాటు చేయడానికి గ్రేటర్ నోయిడాలోని ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. గన్నవరం వాతావరణ శాఖ అధికారి శేషసాయి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.