దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదాయం పెంచేందుకు చర్యలు కనిపించడం లేదు. ప్రధానంగా ఇక్కడ దుకాణాల నుంచి చాలా బకాయిలు రావాల్సి ఉంది. వారి లాబీయింగ్ వల్ల నియంత్రణ సాధ్యం కావడంలేదు. కొత్త వారిని రానిస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ దుకాణదారులు ఏదో ఒక రాజకీయపార్టీకి చెందిన వారు కావడంతో వారిపై చర్యలు తీసుకోవడంలో ఆలయ అధికారులు వెనుకడుకు వేస్తున్నారనే విమర్శలు వినిస్తున్నాయి. దాంతో దుకాణాల నుంచి రావాల్సిన ఆదాయం రావడంలేదు. ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా దుకాణాలు వేలం నిర్వహించాలను కుంటే దుకాణం చేజారకుండా కోర్టు వెళుతున్నారు. దుర్గగుడికి సుమారు 162 ఎకరాలకు పైగా మాగాణి, సుమారు 58 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. కాని ఆదాయం తగినంతగా రావడం లేదు.