
పాపాల చిట్టా బయటపడింది. మామూళ్ల పుట్ట బద్దలైంది. మద్యం మత్తు వదిలిపోతోంది. సిండి‘కోట్లా’ధిపతుల వివరాల్ని ఏసీబీ నివేదిక బట్టబయలు చేసింది. విశాఖ నగరంలో రెండు సిండికేట్లు భారీఎత్తున మామూళ్లు సమర్పించుకున్నాయి. అక్రమాలపై చూసీచూడనట్టు వ్యవహరించినందుకు ఉన్నతస్థాయి నుంచి కింది స్థాయి వరకూ కాసుల వర్షం కురిపించాయి. ఈ వివరాలు.
ఒక్క విశాఖ నగరంలో కేవలం రెండు మద్యం సిండికేట్లు భారీఎత్తున మామూళ్లు సమర్పించుకున్నాయి. ఈ ఏడాది చివరి మూడు, నాలుగు నెలల్లో రూ.కోటిన్నర ముడుపులు చెల్లించాయి. మరో సిండికేట్ యజమాని, తెలుగుదేశం పార్టీకి చెందిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నగరంలో ఎంఆర్‌పీకి మద్యం విక్రయించకుండా సహకరించినందుకు ఎక్సయిజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణకు రూ.25 లక్షలను అందజేశారని వచ్చిన ఆరోపణలకు ఏసీబీ నివేదిక బలం చేకూర్చింది. ఎంఆర్‌పీ సెటిల్‌మెంట్ కోసం రాష్ట్ర మంత్రికి ఇవ్వడానికి రూ.1,20,000 వసూలు చేసినట్టు ఏసీబీ అధికారులు ఒక చోట పేర్కొన్నారు. మరోచోట హైదరాబాద్‌లో మిస్లేనియస్ వ్యయమంటూ రూ.10 లక్షలు, హైదరాబాద్‌లో ఖర్చులంటూ మరో రూ.10 లక్షలు చూపించారు. ఈ డబ్బు ఇచ్చిన ట్లు చూపిన తేదీలు, వెలగపూడి సిండికేట్ పెద్దలతో కలసి వెళ్లిన తేదీలు ఒక్కటే కావడంతో ఆరోపణలకు బలం చేకూరింది.పలువురు అధికారులకు గణేష్ సిండికేట్ ఇచ్చిన మామూళ్ల వివరాలను ఏసీబీ సేకరించింది. ఎక్సయిజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్‌కు భారీగా రూ. 26,67,000 చెల్లించినట్లు పేర్కొన్నారు. ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్‌కు రూ.2,61,00, సూపరింటెండెంట్‌కు రూ.7,33,280, సహాయ సూపరింటెండెంట్‌కు రూ.3,64,000, టాస్క్‌ఫోర్స్ సూపరింటెండెంట్‌కు రూ. 1,96,400 ఇచ్చినట్లు పేర్కొన్నారు.
నివేదికలోని మరికొన్ని వివరాలివి.... మీడియా న్యూస్ ఆధారంగా....
సీఐ ఆర్ ప్రసాద్‌కు రూ.10 లక్షలు
ఏసీఎస్ రామరాజుకు రూ.3 లక్షలు
సీఐ దాస్‌కు రూ.7.84 లక్షలు
సీఐ రవికుమార్‌కు రూ.3 లక్షలు.
సీఐ రమణకు రూ.లక్ష
సీఐ గోపాలకృష్ణకు రూ.2.30.000
సీటీఎఫ్ సీఐ డి.వి.పి.రెడ్డికి రూ.2.50.000
ఎక్సయిజ్ సహాయ కమిషనర్‌హనుమంతరావుకు పలు విడతలుగా రూ. 5 లక్షలు
పెందుర్తి కార్పొరేటర్‌కు పలు విడతలుగా రూ.43 వేల వరకూ....