25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • Feb 03 ,2012 08:52 pm

    Kanakadurga

    ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయంలో విమాన గోపురానికి శుక్రవారం మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఈ కుంభాభిషేకంలో దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య, కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 పవిత్ర నదీ జలాలతో త్రి సముద్ర జలాలకు జయేంద్ర సరస్వతి కలశ పూజ చేశారు.

    అనంతరం దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. దోషాల నివారణ కోసం పన్నెండేళ్లకి ఒకసారి మహా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంత్రి రామచంద్రయ్య మాట్లాడుతూ పండుగల తేదీలపై ఏర్పడ్డ సందిగ్ధతను త్వరలోనే తొలగిస్తామన్నారు. అందుకు సంబంధించి క్యాలెండర్‑ను తయారు చేస్తామన్నారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers