18 Jun Tuesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Jul 13 ,2012 04:41 pm

    hookah_centres2

    hookah_centresహుక్కా కేంద్రాల విషయంలో పోలీసుశాఖ పక్కా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటి వరకు పబ్‌లు, హుక్కా కేంద్రాల పట్ల చూసీచూడనట్టు వ్యవహరించిన పోలీసులు నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. పోలీసుల వరుస దాడులతో 'హుక్కా' హాట్ టాపిక్‌గా మారింది. నిబంధనలు పాటించని పబ్‌లు, హుక్కా కేంద్రాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు యువత వాటికి బానిసకాకుండా చూడడానికి నగర పోలీసు కమిషనర్ నడుం బిగించారు. నగరంలోని పబ్‌లు, హుక్కా కేంద్రాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని త్వరలో నిర్వహించనున్నారు. ఇందులో విధివిధానాలు వివరించిన తర్వాత యాక్షన్‌కు సిద్ధమవుతామని పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు.

    రిజిస్టర్లు, సీసీ కెమెరాలు తప్పనిసరి నగరంలోని అన్ని హుక్కా కేంద్రాలు, పబ్‌లకు సంబంధించిన పక్కా సమాచారాన్ని సేకరించామని, ప్రణాళిక లేకుండా వాటిని నిర్వహిస్తున్నట్టు తెలిసిందని చెప్పారు. ఇక నుంచి అలా కుదరదని, ప్రతి హుక్కా కేంద్రం ఒక రిజిస్టర్, సీసీ కెమెరాలు నిర్వహించాలని, కేంద్రానికి వచ్చే వారి వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలని చెప్పారు. పేరు, వయస్సు, తండ్రి పేరు, చిరునామా అన్నీ స్పష్టంగా ఉండాలని, సీసీ కెమెరాల్లో వారానికి సంబంధించిన బ్యాక్అప్ ఉండాలని, కొంతమంది మైనర్లు ఎక్కువ వయస్సు చెప్పుకుని హుక్కా కేంద్రాల్లోకి వెళ్తున్నారని, అటువంటి వారిని నిర్వాహకులు వెనక్కి పంపాలని సూచించారు. అనుమానం వస్తే వయస్సుకు సంబంధించిన «ద్రువీకరణపత్రం పరిశీలించాలని, పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఎవరైనా మైనర్లు పట్టుబడితే మొదటగా వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తామని కమిషనర్ చెప్పారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers