

భాగ్యనగరంలో బాలల డాక్యుమెంటరీ చిత్రోత్సవ సందడి షురూ కానుంది. హైటెక్ సిటీ వద్దగల శిల్పకళావేదికలో నవంబర్ 5 నుంచి 7వరకు హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ జరగనుంది. ప్రముఖ దర్శకులు వైశాలిబిస్త్ థియేటర్ వర్క్ షాప్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ముంబై, చెనై, బెంగళూరులకు చెందిన ప్రఖ్యాత రంగస్థల సంస్థలు పాల్గొంటున్నాయి. 2న టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కా ర్యదర్శి చందనాఖన్, సినీ నటుడు దగ్గుబాటి రానా, దర్శకుడు జాగర్లమూడి క్రిష్ లోగోను ప్రారంభించనున్నారు. దీనికి అందరూ ఆహ్వానితులే.
టికెట్ల కోసం: ప్రదర్శనకు హాజరు కావాలనుకునేవారు టికెట్‌లను బుక్ మై షో ద్వారా పొంద వచ్చు. టికెట్ ధర రూ.125లు. వివరాలకు ఫోన్: 88858 93587.
నవంబర్ 5: ‘లాల్ పెన్సిల్’:
భాష: హిందీ, ప్రదర్శకులు: అరణ్య థియేటర్ గ్రూప్, ముంబై, ఇతి వృత్తం: కొరియన్ నవల ఆధారంగా దీన్ని రూపొందించారు. ఓ సామాన్య చిన్నారి తన సహ విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య నడిచే కథ. మాములు వి ద్యార్థిని ఎలా స్టార్ అయ్యింది అనేది నాటకం ఇతివృత్తం. సమయం: సాయంత్రం 6.30 గంటలకు.
నవంబర్ 6: మంకీ బిజినెస్: భాష: ఇంగ్లీషు, ప్రదర్శకులు: థియేటర్ నిషా ఎసెంబుల్ ప్రొడక్షన్, చెన్నై. ఇతి వృత్తం: కరాడి టేల్స్ ని రంగస్థలంపై ప్రదర్శించనున్నారు. అరణ్యంలో మనుషులు, వింత చేష్టలతో అలరించే కోతుల కథ ఇది. సమయం: సా॥6.30.
నవంబర్ 7: అతిథి అండ్ ఫ్రెండ్స్: భాష: ఇంగ్లీషు, కన్నడ, ప్రదర్శకులు: రఫికీ, బెంగళూరు
ఇతి వృత్తం: అతిథి తన స్నేహితుల సాహసాల గాథ ఇది. షాడో పప్పెటరీ, మాస్క్‌లు, సంగీతం సమ్మిళనంగా ప్రదర్శించనే ఈ నాటకం ఆసక్తి కరంగా సాగుతుంది. సమయం: సాయంత్రం 6.30
...avnk