20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 3.gif

    Oct 29 ,2012 12:53 pm

    malavika-innee

    కేవలం తొమ్మిదేళ్ల ప్రాయంలోనే సొంత అల్బమ్‌ను రూపొందించి, పదమూడేళ్లలో ‘యునిక్ వరల్డ్ రికార్డు’ను కైవసం చేసుకున్న చిన్నారి గాయనీ మాళవికను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి నేతృత్వంలో మాళవిక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఆయన చేతుల మీదుగా యునిక్ వరల్డ్ రికార్డు సర్ట్ఫికెట్‌ను స్వీకరించారు.
           ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, అతి చిన్న వయస్సులోనే ప్రపంచ రికార్డు సర్ట్ఫికెట్ కైవసం చేసుకున్న మాళవిక ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ, మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయస్సులో ప్రపంచ రికార్డు సృష్టించిన మాళవిక మనందరికీ ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. విద్యాభ్యాసం దశలో ఉన్న చిన్నారులు మాళవికను ఆదర్శంగా తీసుకుని, వారికి ఆసక్తి, అభిరుచి ఉన్న ఆయా రంగాల్లో రాణించేందుకు ప్రయత్నించాలన్నారు. అతి చిన్న వయస్సులో మాళవిక తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో ఎంతో మధురమైన గీతాలను ఆలపించటం ఆమెకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా పేర్కొన్నారు.

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers