
సుధీర్ఘకాలంగా తెలుగు ప్రేక్షకుల మదిలో మెదులుతోన్న ప్రముఖ హీరోయిన్ త్రిష తండ్రి కృష్ణన్ గురువారం రాత్రి హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తన్న కృష్ణన్ కు గుండెపోటు రావడంతో ఆయన్ను సోమాజీగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలిసిన వెంటనే త్రిష, ఆమె తల్లి ఉమ, బంధువులు హైదరాబాద్ కు తరలి వచ్చారు. కృష్ణన్ అంత్యక్రియలు శుక్రవారం నాడు హైదరాబాద్ లో నిర్వహిస్తారు. ఇంటికి పెద్దదిక్కు హఠాన్మరణంతో త్రిష కుటుంభం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా ఈ ఉదయం నుంచీ త్రిషను పరామర్శించేందుకు సినీ రంగ ప్రముఖులు ఆమె ఇంటికి తరలి వస్తున్నారు.
...avnk