20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 13.png

    Oct 12 ,2012 05:20 pm

    metro_rail_pro_inner

    హైదరాబాద్ ప్రతిపాదిత మెట్రో మార్గం అష్ట వంకర్లు తిరుగుతోంది. తాజాగా దీని కన్ను పాత గాంధీ ఆస్పత్రి స్థలంపై పడింది. దీంతో ఏకంగా రూట్‌ని 90 డిగ్రీల కోణంలో మార్చుకొని ఆ దిశగా పయనిస్తోంది. ‘ఎల్ అండ్ టీ’కి కల్పతరువుగా మారిన ‘కారిడార్లు’ ఇప్పటికే నగరంలో ఎకరాలకు ఎకరాలు దోచేశాయి. ఇంకా పట్టాలెక్కని ప్రాజెక్ట్ మరో ‘ఔటర్’గా మారనుందేమో వేచి చూడాల్సిందే!  మొన్నటికి మొన్న ఒప్పందానికి విరుద్ధంగా కిలోమీటర్ పొడవు పెరిగిన మెట్రోరైలు ప్రాజక్టు తాజాగా అలైన్‌మెంటులోనూ మార్పు చోటుచేసుకుంది. దాదాపు మూడు నెలల క్రితం వరకు అసలు అపాయింటెడ్ డేట్‌ను కూడా ఖరారు చేయకుండానే అక్రమంగా పిల్లర్లను నిర్చించిన మెట్రో అధికారులు ఇప్పుడు పాత గాంధీ ఆస్పత్రి స్థలానికి ఎసరు పెట్టారు. దాదాపు రూ.500కోట్ల విలువైన ఈ స్థలాన్ని కాజేసేందుకు ఏకంగా అలైన్‌మెంటునే మార్చేశారు.
            రైల్వే అభ్యంతరాన్ని సాకుగా చూపుతూ ఔటర్ రింగురోడ్డు తరహాలో కారిడార్‌ను తొంభై డిగ్రీల్లో వంకర తిప్పడం విశేషం. ఎల్ అండ్‌టీతో ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం ప్రకారం 212 ఎకరాల స్థలాన్ని మూడుచోట్ల డిపోల నిర్మాణానికి, మరో 57ఎకరాల స్థలాన్ని స్టేషన్ల నిర్మాణానికిగాను ఎల్ అండ్ టీకి ఇవ్వాల్సి ఉంది. ఇందులో డిపోలకు పది ఎకరాలు (కోర్టు కేసులు) మినహా మిగిలింది ఇవ్వగా, స్టేషన్లకు సంబంధించిన 57 ఎకరాల్లో ఇప్పటికే 29 ఎకరాలు ఇచ్చారు. ఇంకా 28 ఎకరాల స్థలం ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 17ఎకరాల భూమి ఉండగా, విద్యార్థుల ఆందోళన ఫలితంగా ఇంకా స్థలం అక్కడ బదలాయింపు సాధ్యం కాలేదు.
            ఈ నేపథ్యంలో తాజాగా సికింవూదాబాద్ రైల్వేస్టేషన్‌కు పక్క నుంచి ఉన్న జూబ్లీ బస్టాండు - ఫలక్‌నుమా మార్గమైన కారిడార్-2 అలైన్‌మెంటును పాత గాంధీ ఆస్పపత్రి వరకు విస్తరించారు. ఇందుకోసం అలైన్‌మెంటును తొంభై డిగ్రీల కోణంలో తిప్పుతూ పాత గాంధీకి చేర్చడం విశేషం. ఆస్పత్రికి చెందిన పదెకరాల స్థలాన్ని సైతం ఎల్‌అండ్‌టీకి ధారాదత్తం చేసేందుకు దస్త్రాన్ని రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదానికి పంపారు.
           అయితే.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ప్రపంచస్థాయి స్టేషన్‌గా అభివృద్ధిచేసే ఆలోచన ఉన్నందున మెట్రో మార్గాన్ని మార్చాలని రైల్వేశాఖ కోరడంవల్లే అలైన్‌మెంటును మార్చినట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. లేనిపక్షంలో స్టేషన్ వద్ద అండర్ గ్రౌండ్ మార్గంలో కారిడార్‌ను నిర్మించుకోవచ్చని కూడా రైల్వేశాఖ సూచించిందనీ, సాంకేతికపరంగా అది సాధ్యం కానందునే అలైన్‌మెంటును మార్చినట్లు పేర్కొంటున్నారు.

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers