జీవ వైవిధ్య సదస్సుకు వచ్చిన వేలాది మంది విదేశీ ప్రతినిధులకు భ ద్రత. నగరంలో ఆందోళనల్లో దాడు లు, ప్రతిదాడలు... ఏ మార్గంలో ఎ లాంటి వ్యక్తులు వస్తున్నారో తెలియ దు... ఏ అసాంఘిక శక్తులు ఏమూలన నక్కి ఉన్నాయో పసిగట్టాలి.ఇవన్నీ జరగాలంటే పోలీసులు అధునాతన సాంకేతిక వ్యవస్థను ఉపయోగించా ల్సిందే. ఇందుకోసమే అండర్ వెహికిల్ సెర్వలెన్స్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. దేశంలో కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న దీన్ని ప్రస్తుతం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. హెచ్ఐసీసీలో జరుగుతున్న జీవవైవిధ సదస్సుకు చేపట్టిన భద్రతాచర్యల్లో పోలీసుల యూవీఎస్ఎస్‌కు పనిచెబుతున్నారు.
యూవీఎస్ఎస్ అంటే..
అండర్ వెహికల్ సర్వెలెన్స్ సిస్టమ్‌ను సంక్షిప్తంగా యూవీఎస్ఎస్ అంటా రు. సైబరాబాద్ పరిధిలో ఈ విధానా న్ని ఉపయోగించాలని కొన్నాళ్ల నుంచి అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఎట్టకేలకు కాప్ (కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీసీ) పుణ్యమాని ఇక్కడ డె మో నిర్వహించడానికి అవకాశం దక్కి ంది. రెండు రోజుల క్రితం నుంచి ప్రా రంభమైన జీవవైవిధ్య సదస్సుకు కర్ణాటక నుంచి యూవీఎస్ఎస్‌ను రప్పించారు. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన దీన్ని కొనుగోలు చేయాలని మన రాష్ట్ర పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది.