రవాణా వ్యవస్థను సమూలంగా మార్చేయగల సామర్థ్యం ఉన్న 'మెట్రో రైలు' ప్రాజెక్టు నగర స్వరూపాన్ని పూర్తిగా మార్చేయనుంది. మెట్రోతో ఆకాశంలో మరో కొత్త నగరాన్ని సృష్టించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కారిడార్ల పొడవునా ఆకాశ మార్గాలను నిర్మిస్తూ వాటికి స్టేషన్లను అనుసంధానిస్తూ కొత్త మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. మెట్రో పిల్లర్ల నుంచి స్టేషన్ల నమూనా వరకూ అన్నింటా 'ఎల్ అండ్ టీ' మెట్రో ఇంజనీర్లు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మూడు మెట్రో కారిడార్లలో వచ్చే ఫ్లై ఓవర్లు, రైల్ ఓవర్ బ్రిడ్జిలపై డబుల్ ఎలివేషన్‌తో 'ఎత్తు పై ఎత్తు' ట్రాక్స్‌ను నిర్మించనున్నారు. సమీప భవిష్యత్తులో రైల్వే శాఖ డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టనుండడంతో రైల్వే క్రాసింగ్స్ వద్ద ఎనిమిది మీటర్ల ఎత్తులో మెట్రో కారిడార్లను నిర్మించనున్నారు. ఇక పంజాగుట్ట వంటి ఫ్లై ఓవర్లకు ఆరు మీటర్ల ఎత్తులో పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు.
మియాపూర్ - ఎల్‌బీనగర్, జాబ్లీబస్‌స్టేషన్-ఫలక్‌నుమా, నాగోల్-మెట్టుగూడలలో ఎనిమిది రైల్వే క్రాసింగ్స్, 12 ఫ్లై ఓవర్ల మీదుగా ప్రయాణించే మెట్రో ప్రాజెక్టులో మూడు ఇంటర్ చేంజ్ స్టేషన్లు ఉన్నాయి.మూడుచోట్ల రెండేసి స్టేషన్లు మూడు ప్రాంతాల్లో మెట్రో రైలు ఇంటర్‌చేంజ్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ ఆయా కారిడార్ల గుండా ప్రయాణించే ప్రయాణికులు ఒక రైలు మారి మరొక రైలు ఎక్కడానికి అవకాశం ఉంటుంది.మైత్రివనం నాగోల్ నుంచి శిల్పారామం రూట్‌లో ప్రయాణించే మెట్రో - మియాపూర్-ఎల్‌బీనగర్ వరకూ ప్రయాణించే మెట్రో రైలు ఇక్కడ ఒకే చోట ఏర్పాటు చేసే రెండు స్టేషన్లలోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ కారిడార్ ఒకటి స్టేషన్ పైన ఉండగా కారిడార్ 3 స్టేషన్ కింద ఏర్పాటు చేయనున్నారు.ప్యారడైజ్ నాగోల్ నుంచి శిల్పారామం రూట్‌లో వచ్చే మెట్రో - జూబ్లీబస్ స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వైపునకు వెళ్లే మెట్రో రైలు ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ కారిడార్-2 స్టేషన్ పైన ఏర్పాటు చేస్తుండగా కారిడర్-3 స్టేషన్ కింద ఉంటుంది.ఎంజీబీఎస్ జూబ్లీబస్‌స్టేషన్ - ఫలక్‌నుమా మెట్రో కారిడార్ - మియాపూర్ -ఎల్‌బీనగర్ వైపునకు వెళ్లే కారిడార్లు కలుస్తాయి. ఇక్కడ కారిడార్-2 స్టేషన్ పైన, కారిడార్ -1 స్టేషన్ కింద ఏర్పాటు కానున్నాయి.8 చోట్ల రైల్వే క్రాసింగ్స్ నగరంలో మూడు ప్రధాన మార్గాల్లో ప్రయాణించే మెట్రో రైలు ఎనిమిది ప్రాంతాల్లో రైల్వే ట్రాక్స్‌ను క్రాస్ చేయనుంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ అనుమతులు సైతం మెట్రో రైలుకు లభించాయి.