20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Jul 24 ,2012 11:50 am

    11.3.1

    Hydarabadనగరంలోని చారిత్రక ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల కోసం టూరిజం శాఖ ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా హోప్ ఆన్ హోప్ ఆఫ్ పేరిట సిటీ ప్యాకేజీ టూర్ కోసం నాలుగు ఏసీ హైటెక్ కోచ్ బస్సులను, ఎన్‌టీఆర్ గార్డెన్ వద్ద పర్యాటక బస్సు షెల్టర్‌ను పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.ప్రతి రోజు నగరంలో పేరుగాంచిన 13 పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ ప్రతి అరగంటకో బస్సు పర్యాటకులను కోరిన ప్రదేశాలకు చేరుస్తాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా ఇలాంటి ప్యాకేజీ టూర్‌ను ప్రారంభించినట్టు తెలిపారు.

    పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని సదుపాయాలు కల్పించనున్నట్టు చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. త్వరలో ఇలాంటి ప్యాకేజీ టూర్‌లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామన్నారు. ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చందనాఖాన్, టూరిజం శాఖ ఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనరు రజత్‌కుమార్, ప్రత్యేకాధికారి కిషన్‌రావు, హెచ్ఎండీఏ కమిషనరు నీరబ్‌కుమార్, ప్రత్యేకాధికారి జలాల్ అక్బర్ పాల్గొన్నారు.

    టారిఫ్: పెద్దలకు రూ. 250, పిల్లలకు రూ.200 చెల్లించి అన్ని పర్యాటక ప్రదేశాలను కోరిన సమయాల్లో తిరగవచ్చు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers