
కింగ్‌ఫిషర్ సర్వీసుల పునఃప్రారంభం ఇప్పట్లో జరిగేలా లేదు. విమాన సర్వీసుల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వాలంటే ముందుగా విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఏ) అనుమతి పొందాలి. సిజిసిఏ పచ్చజెండా ఊపకపోతే సర్వీసులను అనుమతించబోమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ స్పష్టంగా చెప్పారు. నిజానికి ఈరోజు నుంచి పాక్షిక లాకౌట్‌ను ఎత్తివేయాల్సి ఉంది. అయితే ఉద్యోగులు విధుల్లో చేరేందుకు నిరాకరించడంతో లాకౌట్ ఎత్తివేతను కింగ్‌ఫిషర్ మేనేజ్‌మెంట్ 12వ తేదీకి మార్చింది. వేతన బకాయిలు చెల్లించాలంటూ ముంబాయి, ఢిల్లీ నగరాల్లో ఉద్యోగులు ఆందోళన చేశారు. ఎస్క్రో అకౌంట్లో ఉన్న 60 కోట్ల రూపాయల్ని విడుదల చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది. ఈ మొత్తం ఉద్యోగులకు రెండు నెలల పాటు వేతనాలు చెల్లించడానికి సరిపోతుంది.