20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 1.1.gif

    Oct 29 ,2012 11:17 am

    Sebastian-Vettel-of-Redగ్రాండ్ ప్రీ విజయానందాన్ని వెటల్ ఇలా పంచుకున్నాడు :  ‘నాకు ఇది ప్రత్యేక గ్రాండ్ ప్రీ. గత ఏడాది జరిగిన మొదటి ఇండియన్ గ్రాండ్ ప్రీలో విజయం సాధించిన తర్వాత ఈ రేస్‌పై నాకు మక్కువ పెరిగింది. ఈఏడాది పోల్ పొజిషన్‌ను సాధించడం, ఆతర్వాత విజేతగా నిలవడం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారత అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను’.
             డిఫెండింగ్ చాంపియన్, రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ) ఇండియన్ గ్రాండ్ ప్రీలో మరోసారి విజయకేతనం ఎగరేశాడు. ఆదివారం గ్రేటర్ నోయిడాలో జరిగిన రేస్‌లో అతను ప్రత్యర్థులను చిత్తుచేస్తూ వరుసగా రెండోసారి ఈరేస్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌ తోపాటు, శనివారం నాటి క్వాలిఫయింగ్ రౌండ్‌లోనూ అద్భుతంగా రాణించిన వెటెల్ పోల్ పొజిషన్‌ను సాధించి, విజయం తనదేనని పరోక్షంగా సంకేతాలు పంపాడు. అదే ఒరవడిని ఆదివారం నాటి రేస్‌లోనూ కొనసాగించి టైటిల్ అందుకున్నాడు.

    sebastian_vettel
           ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సాధించడానికి వెటెల్‌తో తీవ్రంగా పోడీపడుతున్న ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలొన్సో కూడా బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌పై జరిగిన రెండో ఇండియన్ గ్రాండ్ ప్రీ రేస్‌లో అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో అతను రెండు మెక్‌లారెన్ కార్లను అధిగమించి, ఆతర్వాత మార్క్ వెబర్ కారును కూడా ఓవర్ టేక్ చేయగలిగాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్ నికొ హకెన్‌బర్గ్ ఎనిమిదో స్థానాన్ని సంపాదించి తన జట్టుకు నాలుగు పాయింట్లు అందించాడు.
    రేస్ ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని కనబరచిన వెటెల్ చిరస్మరణీయ విజయంతో ట్రోఫీని అందుకొని, అలొన్సో కంటే 13 పాయింట్ల ఆధిక్యానికి చేరాడు. అతని ఖాతాలో ఇప్పుడు 240 పాయింట్లు ఉన్నాయి. పోల్ పొజిషన్‌లో రెండో స్థానంలో ఉన్న వెబర్ ఫైనల్ రేస్‌లో మూడో స్థానంతో సంతృప్తి చెందాడు. మెక్‌లారెన్ డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, జెన్సన్ బటన్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఫెలిప్ మస్సా ఆరు, కిమీ రయికొనెన్ ఏడు, హకెన్‌బర్గ్ ఎనిమిది, రొమెయిన్ గ్రాస్‌జీన్ తొమ్మిది స్థానాలను ఆక్రమించారు.Shan-Sonakshi_Sinha-Ajay_Devgn       పాయింట్లు సంపాదించడానికి అవసరమైన ‘టాప్-10’ జాబితాలోకి చివరి డ్రైవర్‌గా బ్రూనో సెన్నా చేరాడు. కాగా, గత ఏడాది కేవలం రెండు పాయింట్లు సంపాదించిన ఫోర్స్ ఇండియాకు ఈ రేస్‌లో నాలుగు పాయింట్లు దక్కడం విశేషం. ఇదే జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మరో డ్రైవర్ పాల్ డి రెస్టా 12వ స్థానానికి పరిమితమయ్యాడు. కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ పోరులో నిలవడానికి అవసరమైన కీలక పాయింట్లను సంపాదించడం ద్వారా ఫోర్స్ ఇండియా తన కంటే ముందున్న సాబెర్ ఆధిక్యాన్ని 23 పాయింట్లకు తగ్గించగలిగింది. ప్రపంచ మాజీ చాంపియన్ మైఖేల్ షూమాకర్ వెనుక టైరు పంచర్ కావడంతో రేస్‌లో పూర్తిస్థాయి ప్రతిభ కనబరచలేకపోయాడు.
           హెచ్‌ఆర్‌టి తరఫున పోటీపడిన భారత తొలి ఫార్ములా వన్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్‌కు కారు వల్ల ఇబ్బందులు తలెత్తాయి. గేర్ బాక్స్ సక్రమంగా పని చేయలేదు. పైగా, బ్రేకుల సమస్య కూడా అతనిని ప్రతిభకు ఆడ్డంకిగా నిలిచింది. ఫలితంగా అతను 21వ స్థానంలో నిలిచాడు. గత ఏడాది అతనికి 17వ స్థానం లభించింది.harbhajan       కాగా,  బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఆదివారం జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను తిలకించడానికి అభిమానులతోపాటు సెలబ్రిటీలు కూడా పోటెత్తారు. బాలీవుడ్ స్టార్ల నుంచి క్రెటర్ల వరకూ పలువురు హాజరై అభిమానులను మరింత సంతోషపరిచారు. బాలీవుడ్ స్టార్లు అనీల్ కపూర్, నేహా ధుపియా, గుల్ పనాగ్, డినో మోరియా, సొనాలీ బింద్రే, ఆమె భర్త గోల్డీ బెహల్, మందిరా బేడీ, అజయ్ దేవ్‌గన్, సొనాక్షి సింగ్, గాయకుడు షాన్, సంగీత దర్శకులు విశాల్, శేఖర్ తదితరులు ఎఫ్-1వ గ్రామంలో తళుక్కుమని మెరిశారు. సొనాక్షి, అజయ్ దేవ్‌గన్‌లు షాన్‌తో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.vettel-drive       ఇక క్రీడాకారుల విషయానికి వస్తే, లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్, షూటర్లు విజయ్ కుమార్, గగన్ నారంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రేస్ పూర్తయిన తర్వాత చెకర్డ్ ఫ్లాగ్‌ను ఊపే అవకాశం నారంగ్‌కు దక్కింది. ఆర్చర్ దీపికా కుమారి, చెస్ ప్లేయర్ తానియా సచ్‌దేవ్ కూడా ఎఫ్-1 క్రీడాగ్రామంలో కనిపించారు. క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన చిరకాల స్నేహితురాలు గీతా బస్రాతో కలిసి రేస్‌ను తిలకించాడు. ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ఇండియన్ గ్రాండ్ ప్రీని ఎంతో ఆసక్తిగా చూశాడు. కాగా, నిరుడు చెకర్డ్ ఫ్లాగ్ తో కనిపించిన సచిన్ తెండూల్కర్ వ్యక్తిగత కారణాల వల్ల ఈసారి ఇండియన్ గ్రాండ్ ప్రీని చూసేందుకు రాలేదు. మొత్తంగా రేస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగటంతో పాటు సెలబ్రెటీల పోటుతో ట్రాక్ మొత్తం హోరెత్తిపోయింది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers