భారత సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. సహచర క్రీడాకారిణి జాస్తి శారద గోవర్ధిని మెడలో ఆయన మూడు ముళ్లు వేశాడు. అతనికిది రెండో పెళ్లి. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. బంధు మిత్రుల కోసం నిరాడంబరంగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. సైనా నెహ్వాల్‌కు రెండేళ్లు సీనియర్ అయిన గోవర్ధిని జాతీయ స్థాయిలో టైటిళ్లు గెలవకపోయినా చిన్నచిన్న టోర్నీల్లో సెమీస్ వరకు వెళ్లింది. ఎల్బీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న రోజుల నుంచే చేతన్‌కు ఈమె పరిచయం. డబుల్స్ ప్లేయర్ గుత్తా జ్వాలను మొదటి వివాహం చేసుకున్న చేతన్ కొన్ని కారణాల వల్ల జూన్ 2011 నుంచి ఆమెతో విడిపోయాడు. ఆ సమయంలో చేతన్‌ను ఓదార్చిన గోవర్ధిని... అతనితో ప్రేమలో పడింది. ఇప్పటివరకూ సాగిన వీరి ప్రేమ వ్యవహారానికి పెళ్లితో శుభం కార్డు పడింది.
...avnk