
చాంపియన్స్ లీగ్‌లో ఆడుతున్న చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు మైకేల్ హస్సీ స్వదేశమైన ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. హస్సీ వ్యక్తిగత కారణాలతో టోర్నీ మధ్యలోనే జట్టును వీడాడు. ఈ టోర్నీలో సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆడిన హస్సీ ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లకు తుది జట్టులో లేడు. కుటుంబ పరమైన కారణాల వల్ల అతను పెర్త్ కు వెళ్లాడు.
కాగా, చాంపియన్స్ లీగ్‌లో ఐపిఎల్ జట్లు కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్, సూపర్‌కింగ్స్ సెమీస్‌కు చేరలేకపోయిన సంగతి తెలిసిందే. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మాత్రమే సెమీస్ చేరగలిగింది.
...avnk