25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
  • 23.png

    Oct 21 ,2012 07:20 pm


    saina
           ఇటీవలే ఒలింపిక్స్ పతకం గెలుచుకుని మంచి ఊపుమీదున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, హైదరాబాద్ సంచలనం సైనా నెహ్వాల్ తాజాగా డెన్మార్క్ ఓపెన్ టోర్నమెంట్ కూడా గెలుచుకుంది. ఆదివారం జరిగిన టోర్నమెంట్ తుదిపోరులో అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తూ జర్మనీకి చెందిన జూలియన్ షెంక్ పై 21-17, 21-8 గెలుపొంది టైటిల్ సొంతం చేసుకుంది.    
           కాగా, గతరాత్రి ఈ హైదరాబాదీ స్టార్ సీజన్‌లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ప్రత్యర్థి, చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ యిహాన్ వాంగ్ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవడంతో సైనాకు ఫైనల్ బెర్త్ ఖరారైంది. అయితే ఒకవేళ మ్యాచ్ పూర్తిగా కొనసాగినా సైనాదే పైచేయి అయ్యేదేమో. ఎందుకంటే లండన్ ఒలింపిక్స్ ఫైనలిస్టు అయిన యిహాన్ వైదొలిగే సమయానికి సైనానే పూర్తి ఆధిక్యంలో ఉంది. అప్పటికే 21-12తో తొలిగేమ్ నెగ్గిన సైనా రెండోగేమ్‌లోనూ 12-7తో ఆధిక్యంలో ఉన్న సమయంలో మోకాలి గాయం తీవ్రం కావడంతో యిహాన్ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. గతంలో యిహాన్ చేతిలో ఆరుసార్లు ఓటమి చవిచూసిన సైనాకిది ఆమెపై తొలి విజయం కావడం విశేషం. ఈ ఏడా ది లండన్ ఒలింపిక్‌్ఓలోనూ సెమీఫైనల్లో యిహా న్ చేతిలో సైనాకు ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. ఈ దఫా ఫైనల్లో జర్మనీకి చెందిన మూడోసీడ్ జులియన్ షెంక్‌తో సైనా అమీతుమీ తేల్చుకుంది.
           మరో సెమీఫైనల్లో జులియన్ 13-21, 21-14, 21-15తో చైనాకు చెందిన 8వ సీడ్ యాంజియావో జియాంగ్‌ను ఓడించింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ జులియన్‌తో ముఖాముఖి పోరులో 5-3తో సైనానే ముందంజలో ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో జపాన్ ఓపెన్‌లో జులియన్‌తో చివరిసారిగా పోటీపడ్డ సైనాకు ఆ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది.

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers