
ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని మధురానుభూతులుంటాయి. వాటిని నలుగురితో పంచుకోండంటూ భారత స్టార్ బ్యాట్స్ మన్ యువరాజ్‌సింగ్ ట్విట్టర్‌లో ఓ పోటీ పెట్టాడు. ‘లైఫ్ కా బల్లా’ పేరుతో యువీ పోటీని ప్రారంభించిన మరుక్షణం నుంచే అభిమానుల స్పందనలు వెల్లు తన ట్విట్టర్ అకౌంట్‌కు దాదాపు 16 లక్షల మంది ఫాలోయర్లుండగా అన్ని వయసుల, వర్గాల వారి నుంచి రికార్డు స్థాయిలో స్పందనలు వచ్చాయి. ఉత్తమ విద్యార్థి అవార్డును గెలుచుకున్నప్పటి అనుభవాన్ని ఒకరు తెలపగా, హిమాలయాలను అధిరోహించడం గురించి ఒకరు, సొంతింటి కలను నెరవేర్చుకున్న సందర్భం గురించి మరొకరు, ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, సంతానం కలగడం గురించి ఇంకొకరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ జీవితంలోని మధురానుభూతుల్ని ఈ పోటీలో పేర్కొన్నారు. మరి ఇందులో విజేతకు బహుమతులు కూడా ఉంటాయన్న యువీ ఎటువంటి ప్రైజ్ ఇస్తాడో చూడాలి.