
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ దక్కడం ఆ దేశ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్‌కు సుతరాము నచ్చలేదు. అందు కే.. ఇదిగో ఈ నిష్టూర వ్యాఖ్య చేశాడు! ‘మా దేశానికి సంబంధించిన పవివూతమైన విషయాలు మావరకే పరిమితమవుతున్నాయని నేను భావించడం లేదు. సచిన్ గొప్ప ఆటగాడే కావొచ్చు. ఐతే అతను ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి అయివుంటే, అప్పుడు అతని ప్రతిభకు ఈ అవార్డు కొలమానం అయ్యేదేమో! ఐనా, సచిన్‌ను అవార్డుతోనే ఎందుకు సరిపెట్టారు? అతనికి ఆస్ట్రేలియా ప్రధాని పదవే అప్పగించాల్సింది. నా మటుకు ‘‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’’ ఆస్ట్రేలియన్లకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక పురస్కారం’ అని హేడెన్ అన్నాడు. ఇటీవల భారత పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని గిలార్డ్.. సచిన్‌కు ‘‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’’ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, రంజీ మ్యాచ్‌ల్లో ఆడాలని టీమిండియా బ్యా టింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తీసుకున్న నిర్ణయం అతణ్ని మరో రెండు రికార్డుల ముందు నిలబెట్టింది. సుదీర్ఘకాలంగా చెక్కు చెదరకుండా ఉన్న దేశవాళీ రికార్డులు ఇప్పుడు మాస్టర్‌కు దాసోహమయ్యే చాన్సొచ్చిం ది. దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యంకాని సునీల్ గవాస్కర్ సాధించిన 81 శతకాల రికార్డుకు సచిన్ నాలుగు సెంచరీల దూరంలో ఉన్నాడు. అంతేకాకుండా మరో 1383 పరుగులు సాధిస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మాస్టర్ రికార్డులకెక్కుతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టులు, వన్డేలు)లో లెక్కకుమించిన రికార్డులు సొంతం చేసుకున్న సచిన్.. దేశవాళీల్లో మాత్రం ఈ రెండు రికార్డుల్లో లిటిల్ మాస్టర్‌కన్నా వెనకబడి ఉన్నాడు. కెరీర్‌లో 384 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన గవాస్కర్ 81 సెంచరీలతో 25,834 పరుగులు సాధించాడు. అయితే 294 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన సచిన్ 78 శతకాలతో 24,452 పరుగులు చేసి గవాస్కర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. రంజీట్రోఫీలో భాగంగా నవంబర్‌లో రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో సచిన్ బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. అనంతరం రాజస్థాన్‌తో జరిగే మరో మ్యాచ్‌లోనూ మాస్టర్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
...avnk