18 Jun Tuesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 20.png

    Oct 19 ,2012 07:13 pm

    umprie-1200

    'మ్యాచ్‌ ఫిక్సింగ్‌' ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థానీ అంపైర్లు నదీమ్‌ ఘౌరి, అనిస్‌ ఉర్‌ రెహ్మాన్‌లపై విచారణకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పిసిబి) ప్రత్యేక కమిటీని నియమించింది. దీనికి సంబంధించి పిసిబి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ న్యాయ నిపుణులతో కూడిన ఒక కమిటీని అది నియమించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 'అంపైర్లపై వచ్చిన అవినీతి అరోపణలకు సంబంధించి చర్చించేందుకు పిసిబి కార్యవర్గ సమన్వయ కమిటీ సమావేశమైందని, 'స్టింగ్‌' ఆపరేషన్‌ ద్వారా సేకరించిన వీడియో టేపులను తమకు అందించాల్సిందిగా ఈ అవినీతి భాగోతాన్ని వెలికితీసిన భారతీయ ఛానెల్‌ను ఇప్పటికే కోరినట్లు ఆ సమావేశంలో వెల్లడించారని' ఆ వర్గాలు పేర్కొన్నాయి.
        కాగా,  ఘౌరి, రెహ్మాన్‌లతోసహా మరో నలుగురు శ్రీలంక, బంగ్లా అంపైర్లు పలు మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆ ఛానెల్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, తాను నిర్దోషినని, ఆ వీడియో టేప్‌లు నకిలీవని ఘౌరి ఇంతకుముందే పేర్కొన్నాడు. ఈ వ్యవహారం ఏ మలుపుతీసుకుంటుందో..

    ..avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers