25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
  • 13.png

    Oct 18 ,2012 07:53 pm

    dc

    అసలే కష్టాల్లో కొట్టుమిట్టాడుతోన్న డెక్కన్ ఛార్జర్స్ కు ఇవాళ మరో పిడుగుపాటు లాంటి వార్త. ఈ సంస్థకు బాంబే హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. చార్జర్స్‌ ఫ్రాంచైజీ రద్దుపై ఆర్బిట్రేటర్‌ ఇచ్చిన స్టేటస్‌ కో ఆర్డర్‌ను న్యాయస్థానం కొద్దిసేపటిక్రితం (గురువారం) కొట్టి వేసింది. దీంతో బోర్డు ఇచ్చిన రద్దు నోటీసు అమలు కానుంది. ఇక కొత్త టీమ్‌ కోసం వేసిన టెండర్ల ప్రక్రియను కూడా కొనసాగించడానికి బోర్డుకు లైన్‌ క్లియరైంది. ఈనెల 12 సాయంత్రంలోగా వంద కోట్ల బ్యాంక్‌ గ్యారెంటీని ఇవ్వడంలో డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ విఫలమవడంతో బీసీసీఐ డీసీ ఫ్రాంచైజీని రద్దు చేసింది. ఆ టీమ్‌ స్థానంలో కొత్త ఫ్రాంచైజీ కోసం ఈ మధ్యే టెండర్లు కూడా ఆహ్వానించింది. కొత్త ఫ్రాంచైజీ కోసం 12 నగరాలు రేసులో ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌తో పాటు వైజాగ్‌ కూడా ఉండటం గమనార్హం.

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers