
చాంపియన్స్ లీగ్ టీ-20 టోర్నీలో ఇక సిసలైన పోటీకి తెరలేచింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ముగిసి ప్రధాన పోటీల్లో పాల్గొనే జట్లేవో తేలిపోగా ఇవాల్టి నుంచి (శనివారం) టోర్నీ తొలిరోజే హోరాహోరీ పోరు జరగుతోంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న రెండు ఐపీఎల్ జట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లు టోర్నీలో తమ తొలిమ్యాచ్‌లోనే ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కన్నా ముందు దక్షిణావూఫికా దేశవాళీ చాంపియన్ టైటాన్స్, ఆస్ట్రేలియా బిగ్‌బాష్ టోర్నీ విజేత పెర్త్ స్కార్చర్స్ లు తలపడనున్నా అందరి దృష్టీ కోల్‌కతా-ఢిల్లీ ఫైట్‌పైనే. ఈ నేపథ్యంలో లీగ్‌లో బోణీ కొట్టేదెవరనేది ఆసక్తికరంగా మారింది.
సీఎల్ టీ-20లో కోల్‌కతా ఆడ డం ఇది రెండోసారైనా నేరుగా అర్హత పొందడం మా త్రం ఇదే తొలిసారి. ఈ ఏడాది గంభీర్ సారథ్యంలో ఐపీఎల్‌లో విజేతగా నిలవడం ద్వారా భారత్ నుంచి తొలి జట్టుగా చాంపియన్స్ టోర్నీలో అడుగుపెట్టింది. గత ఏడాది మాత్రం క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో నెగ్గడం ద్వారా ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఇక రెండోసారి నేరుగా ప్రధాన టోర్నీలో ఆడుతున ఢిల్లీ 2009లో తొలిసారి పాల్గొంది. అయితే ఐపీఎల్‌లో ఢిల్లీకి నాయకత్వం వహించిన సెహ్వాగ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్దనే డేర్‌డెవిల్స్ పగ్గాలు చేపట్టాడు. ఐపీఎల్‌లో ఫలితాన్ని పక్కనబెడితే ఏ రకంగా చూసినా కోల్‌కతా కన్నా ఢిల్లీ జట్టే బలమైనదిగా కనిపిస్తుంది. అయితే కీలక సమయాల్లో చతికిలబడడమే ఆ జట్టు ప్రధాన లోపం.
కానీ, డేవిడ్ వార్నర్, జయవర్దనే, కెవిన్ పీటర్సన్, సెహ్వాగ్, రాస్ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగివుంది. వీరూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల సత్తా ఉన్నవారే. అంతేగాక వార్నర్, జయవర్దనే, ఇటీవల ముగిసిన టీ-20 ప్రపంచకప్‌లో రాణించడం ద్వారా మంచి ఫామ్‌లో ఉన్నారు. కాగా, పీటర్సన్ మాత్రం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో వివాదం కారణంగా ఇటీవల మ్యాచ్‌లే ఆడలేకపోయాడు. దీంతో ఫామ్‌ను దొరకబుచ్చుకొని సత్తా ప్రదర్శించేందుకు పీటర్సన్‌కు ఈ టోర్నీ అందివచ్చిన అవకాశం కానుంది. గాయం నుంచి కోలుకున్న సెహ్వాగ్‌ది సైతం అదే పరిస్థితి. గంభీర్‌పైనే భారం: కోల్‌కతా బ్యాటింగ్ బలమంతా కెప్టెన్ గంభీర్, జాక్వెస్ కలిస్, బ్రెండన్ మెక్‌కల్లమ్‌లే. అయితే ఐపీఎల్‌లో జట్టును ముందుండి నడిపించిన గంభీర్ తాజాగా ఫామ్ మాత్రం ఆ జట్టుకు కొంత ఆందోళన కలిగించే విషయమే. ప్రపంచకప్‌లో గంభీర్‌తోపాటు మెక్‌కల్లమ్ కూడా ఒక మ్యాచ్‌లో సూపర్ సెంచరీ మినహా పెద్దగా రాణించిందేమీలేదు. ఈ నేపథ్యంలో వారు తిరిగి ఏ మేరకు పుంజుకుంటారనేదే ప్రధానం కానుంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఢిల్లీకి మోర్నీ మోర్కెల్, ఉమేష్ యాదవ్, ఇర్ఫాన్ పఠాన్‌లుండగా, కోల్‌కతా మాత్రం ప్రధానంగా తమ మిస్టరీ బౌలర్ సునీల్ నరీన్‌పైనే ఆధారపడుతోంది. తాజా ప్రపంచకప్‌లో వెస్టిండీస్ విజేతగా నిలవడంలో నరీన్‌ది ప్రధానపాత్ర. ఇక ఈ సమరంలో ఎవరు విజేతగా నిలుస్తారో తేలాల్సిఉంది.
...avnk