
ఎండార్స్‌మెంట్ల ఒప్పందాలకు సంబంధించి దక్కన్ క్రానికల్ నుంచి తనకు రావాల్సిన బకాయిల కోసం వేచిచూస్తున్న భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు సహచర క్రీడాకారులు, ఒలింపిక్ హీరోలైన రెజ్లర్ సుశీల్ కుమార్, బాక్సర్ విజేందర్ సింగ్ బాసటగా నిలిచారు. తనకు అందాల్సిన సొమ్ముల కోసం ఓ టాప్ క్రీడాకారిణి ఇలా ఎదురుచూడాల్సి రావడం తీవ్ర నిరాశకల్గించే అంశమని లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత సుశీల్ కుమార్ వ్యాఖ్యానించాడు.
‘మేం అథ్లెట్లం. దేశ గర్వించదగ్గ రీతిలో విజయాలు సాధిస్తాం. మా ప్రతిభకు ప్రోత్సాహకంగా ఎండార్స్‌మెంట్లను అందుకుంటాం. అలాంటప్పుడు న్యాయబద్దంగా రావాల్సిన సొమ్ములను కూడా చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసం. సైనాలాంటి ఓ టాప్ ప్లేయర్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం’ అని సుశీల్ అన్నాడు. ఇక ఆర్థిక అంశాల పరంగా క్రీడాకారులను ఇలా ఇబ్బంది పెట్టడం మంచి పరిణామం కాదనీ, సైనాకు దక్కన్ సంస్థ బకాయి చెల్లింపుల సమస్య త్వరలోనే సమసిపోతుందనుకుంటున్నానని బాక్సర్ విజేందర్ అన్నాడు.
...avnk