
భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు అరుదైన గౌరవం దక్కింది. ఈ లెజెండరీ లెగ్ స్పిన్నర్‌ను ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా పాలక వర్గం ఏకగీవూవంగా ఎన్నుకుంది. కుంబ్లే ఈ పదవిలో మూడేళ్లపాటు ఉంటాడు. వెస్టిండీస్ గ్రేట్ క్లయివ్ లాయిడ్ ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగాడు. ‘భారత క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షునిగా ఉన్న కుంబ్లేను ఐసీసీ క్రికెట్ కమిటీకి కొత్త చైర్మన్‌గా ఎంపిక చేశాం. కుంబ్లే... క్లయివ్ లాయిడ్ తరహాలోనే కమిటీని సమర్థంగా నడిపిస్తాడనే విశ్వాసం మాకుంది. కమిటీలో ఆండ్రూ స్ట్రాస్‌లాంటి సమకాలీన ఆలోచనలున్న క్రికెటర్ ఉండడం కూడా అధ్యక్షునిగా కుంబ్లేకు ఉపయుక్తం కాగలదు. ఈ ఇద్దరు కూడా ఆధునిక క్రికెట్ ఎదుర్కొంటున్న సమస్యల్ని అర్థంచేసుకొని సమర్థంగా పరిష్కరిస్తారనే నమ్మకముంది’ అని ఐసీసీ ప్రెసిడెంట్ అలెన్ ఇసాక్ అన్నారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్ట్రాస్.. ఇయాన్ బిషప్ స్థానంలో ఐసీసీ కమిటీ సభ్యునిగా నియమితుడయ్యాడు. ఏటా రెండుసార్లు భేటీ అయ్యే ఈ కమిటీకి ఈ సంవత్సరంలో మలివిడత సమావేశం నవంబర్‌లో ఉంటుంది.
...avnk