
ప్రపంచ టెన్నిస్‌ను స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఏకచవూతాధిపత్యంగా ఏలుతుండడం ఆ చైనా అభిమానికి నచ్చలేదు. దీంతో టెన్నిస్‌లో సరికొత్త శకం ఆరంభం కోసం ఫెదరర్‌ను చంపేస్తానంటూ తన బ్లాగ్‌లో రాశాడు. ప్రస్తుతం చైనాలోని షాంఘై మాస్టర్స్ టోర్నీలో ఫెదరర్ పాల్గొంటున్నడు. చైనాకు చెందిన ప్రముఖ వెబ్‌సైట్‌లో ‘బ్లూ క్యాట్ పాలీథీస్టిక్ రెలిజియన్ ఫౌండర్ 07’ అనే యూజర్ నేమ్‌తో గల బ్లాగ్‌లో ‘టెన్నిస్‌లో కొత్త శకం ఆరంభం కోసం అక్టోబర్ 6న ఫెదరర్‌ను హత్య చేయడానికి ప్లాన్ చేశాను’ అని రాశాడు.
ఆ వ్యాఖ్యతోపాటు టెన్నిస్ కోర్టులోనే ఫెదరర్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టి బలి ఇస్తున్నట్లుగా ఓ ఫొటోను సైతం చిత్రించాడు. దీంతో టోర్నీ నిర్వాహకులు ఈ బెదిరింపు వ్యాఖ్యను తీవ్రంగా పరిగణించారు. డజను మంది ప్రత్యేక భద్రతా సిబ్బందితో ఫెదరర్‌కు కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. ఫెదరర్ ప్రాక్టీస్ చేసిన కోర్టుకు ఇరువైపులా వీరు రక్షణగా ఉన్నారు. అయితే తరువాత తన మనసు మార్చుకున్న ఆ బ్లాగర్ తన వ్యాఖ్య పట్ల ఫెదరర్‌కు క్షమాపణ చెప్పాడు. కానీ, దయతో మాత్రమే ఫెదరర్‌ను వదిలేస్తున్నానని అదే బ్లాగ్‌లో పేర్కొన్నాడు. ఐతే, బ్లాగర్ హెచ్చరికలేవీ ఫెడెక్స్ ఆటపై ప్రభావం చూపలేదు. తొలిరౌండ్లో తైవాన్ ఆటగాడు లూ యన్‌ను ఓడించి ముందజ వేశాడు ఫెదరర్.
...avnk