
కొలంబోలో జరుగుతోన్న ఐసీసీ మహిళల ప్రపంచ టీ20 కప్ ను ఆస్ట్రేలియా మహిళల జట్టు రెండవ సారి సొంతం చేసుకుంది. 143 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు బౌలర్ల రాణించడంతో కీలక సమయంలో ఇంగ్లాండ్ జట్టు వికెట్లను కోల్పోయింది. జోనసెన్ మూడు వికెట్లు, హంటర్, థాలేకర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లాండ్ మహిళ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో అత్యధికంగా కెమారాన్ 45 పరుగులు చేసింది.
ఇదిలా ఉండగా, టీ20 ప్రపంచకప్ ఫైనల్ వార్‌కు రెడీ అయింది. టైటిల్ కోసం ఆతిథ్య శ్రీలంక, వెస్టిండీస్ మధ్య నేడు జరగబోయే ఫైనల్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారి చాంపియన్‌గా నిలవడానికి రెండు జట్లూ ఆరాటపడుతున్నాయి. ఎవరు గెలిచినా.. ఈసారీ టీ20ల్లో కొత్త చాంపియన్ ప్రపంచానికి పరిచయం కానుంది.
...avnk