23 ఏళ్ళ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ అనంతరం సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ యోచనలో వున్నానని ప్రకటించగా, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాత్రం సచిన్‌లేని భారత క్రికెట్‌ను ఊహించలేకపోతున్నానని వ్యాఖ్యానించాడు. అయితే అతను రిటైర్ కావాలా వద్దా అన్న చర్చలో పాల్గొనడానికి నిరాకరిస్తూ, దానిపై సచిన్ మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సివుంటుందని అన్నాడు. సచిన్‌తో 13 ఏళ్ళపాటు డ్రస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం గొప్ప గౌరవమని అంటూ, ఏ క్రీడాకారునికైనా రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకోవడం కష్టమని వ్యాఖ్యానించాడు. క్రికెట్లో స్పిన్నర్ల ప్రాభవం తగ్గుతోందన్న వ్యాఖ్యానాలను టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో స్పిన్నర్‌గా రికార్డుల కెక్కిన కుంబ్లే త్రోసిపుచ్చుతూ, గ్రామీ శ్వాన్ వంటి ఇంగ్లండ్ స్పిన్నర్‌తో పాటు సయీద్ అజ్మల్, అశ్విన్‌లు మరింతగా మెరుగవుతున్నారని అన్నాడు.
...avnk