
సూపర్‌ఎయిట్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ విసిరిన లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన సఫారీలు చివరి వరకూ పోరాడి ఓడారు. సౌతాఫ్రికాపై భారత్ 1 పరుగు తేడాతో గెలిచి, టోర్నీ నుంచి వైదొలిగింది. రన్‌రేట్ ప్రకారం భారత్ సెమీస్‌కు చేరాలంటే 121 పరుగులకు సఫారీలను నియంత్రించాలి. సఫారీ ఆటగాడు ప్లెస్సీ (65) వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్ ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. సఫారీలను నియంత్రించడంలో టీమిండియా ఆటగాళ్లు విఫలమైయ్యారు. సఫారీలు 151 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్‌ను ముగించడంతో భారత్‌కు స్వల్ప తేడాతో విజయం లభించింది.
అంతకు ముందు టాస్ గెలిచిన సౌతాఫ్రికా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఆదిలోనే గంభీర్ (8) వికెట్టును కోల్పోయిన భారత్ ఇబ్బందుల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న కోహ్లి (2), సెహ్వాగ్ (17) పరుగులకే పెవిలియన్ చేరడంతో భారత్‌కు బ్యాటింగ్ ఆందోళన కల్గించింది. మిడిల్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ (25), యువరాజ్ (21) పరుగులు చేయడంతో భారత్ మళ్లీ గాడిలో పడ్డట్టు కనిపించింది. సురేష్ రైనా (45), ధోనీ (23) పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మోర్కెల్ , పీటర్‌సన్‌లకు తలో రెండు వికెట్లు లభించగా, కల్లిస్‌కు ఒక వికెట్టు లభించింది.
