20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Oct 02 ,2012 11:37 pm

    Pakistan-win

    ఐసీసీ ప్రపంచ ట్వంటీ20 కప్ టోర్నమెంట్ లో సూపర్ 8 రౌండ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ విజయం సాధించి సెమీఫైనల్ ఆశల్ని సజీవంగా ఉంచుకొంది. పాకిస్థాన్ నిర్ధేశించిన 150 పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులకు చేసింది. దాంతో పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హస్సీ ఒంటరి పోరాటంతో 54 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు .

    అంతకుముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. పాకిస్థాన్ జట్టులో అత్యధికంగా నాసిర్ జెమ్ షెడ్ 55, కమ్రాన్ అక్మల్ 32, అబ్దుల్ రజాక్ 22 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్ 3, దోహర్తి, వాట్సన్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers